క్రైమ్/లీగల్

ఆర్ ఎక్స్ 100 సినిమా తరహాలో. ఇద్దరు విద్యార్థుల ఆత్మాహుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, అక్టోబర్ 1: రోజురోజుకు సినిమాల ప్రభావంతో యువత పెడదారి పడుతోందని, ఆర్ ఎక్స్ 100 సినిమా తరహాలో ఆదివారం జగిత్యాలలో ఇద్దరు విద్యార్థులు ఆత్మాహుతి చేసుకున్నారని జగిత్యాల డీఎస్పీ ఎం. వెంకటరమణ వెల్లడించారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ జగిత్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మహేందర్, రవితేజ అనే ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు ఇదే పాఠశాలలోని చదువుకుంటున్న ఇద్ద రు అమ్మాయిలతో ప్రేమలో పడ్డారని ఈ క్రమంలోనే ఒకరికొకరు ఫోన్‌లో తరచూ చాటింగ్ చేసుకోవడం, మా ట్లాడుకుంటున్నారన్నారు. ఇదిలా ఉండగా భవిష్యత్‌లో తమ ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులు ఒప్పుకోరని భావించి ఇద్దరు విద్యార్థులు ఆత్మాహుతి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ఆర్‌ఎక్స్ 100 సినిమా ప్రభావంతోనే ఆదివారం రాత్రి 10వ తరగతి చదువుతున్న ఇద్దరు స్థానిక పంప్‌లో పెట్రో ల్ కొనుగోలు చేసి మిషన్ కాం పౌండ్ ప్రాంతానికి చేరుకొని సజీవ దహనమైన సంఘటనపై దురదృష్టకరం అన్నారు. అప్పటికే వారిద్దరూ మద్యం సేవించి ఉండి ఉంటారని, ఆ మత్తులో వాళ్ల ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుకొని పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మాహుతికి పూనుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. మంటల్లో కాలుతున్న ఇరువురిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే 80శాతం శరీరం కలిపోయి మహేందర్ మృతి చెందాడన్నారు. అదే సంఘటనలో తీవ్ర గాయాలపాలైన రవితేజను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుం డగా మార్గం మధ్యలో మృతి చెందాడని తెలిపారు. రవితేజకు మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఉందని, కొంతమంది మైనర్లు మత్తు పదార్థాలను సేవిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉందన్నారు. 174 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశామని దర్యాప్తు కొనసాగుతుందన్నారు. వీరి ఇద్దరి ప్రేమ విషయం తెలిసిన వారిని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రానున్నాయని పూర్తి వివరాలు సమగ్ర విచారణ అనంతరం వెల్లడిస్తామని జగిత్యాల డీఎస్పీ ఎం. వెంకటరమణ వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ రత్నాపురం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.