క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి, మరోకరికి తీవ్రగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, అక్టోబర్ 1: మండలంలోని చీకటీగలపాలెం గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో వెంకుపాలెం గ్రామానికి చెందిన దారివేముల దాసు (40) అక్కడికక్కడే మృతి చెందగా, గుడిపాటి కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని వెంకుపాలెం గ్రామానికి చెందిన దారివేముల దాసు, గుడిపాటి కృష్ణ ద్విచక్ర వాహనంపై అందుగుల కొత్తపాలెం వెళ్ళి తిరిగి వస్తుండగా తిరుమల డెయిరీకి చెందిన లారీ ఢీకొనడంతో దాసు అక్కడకక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ కృష్ణను వినుకొండ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. మృతుడు దాసుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.