క్రైమ్/లీగల్

పౌర హక్కుల నేత గౌతమ్ విడుదలకు హైకోర్టు అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: కోరెగావ్-్భమా అల్లర్ల కేసులో అరెస్టయి గృహ నిర్మంధంలో ఉన్న ఐదుగురు పౌరహక్కుల నేతల్లో ఒకరైన గౌతమ్ నవలఖాను గృహనిర్బంధం నుంచి విడుదల చేయడానికి ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. తనను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని, కింది కోర్టు తనపై విధించిన ట్రాన్సిట్ రిమాండ్‌ను రద్దు చేయాలని గౌతమ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు అతడిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తాము జోక్యం చేసుకోమని, నిందితులు తమకు నచ్చిన న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని గత వారం సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, సుప్రీం సూచన మేరకు ఐదుగురు పౌరహక్కుల నేతల్లో గౌతమ్ మొదటిసారిగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి గృహ నిర్బంధం నుంచి విముక్తి పొందారు. కాగా, తనపై కింది కోర్టు జారీ చేసిన ట్రాన్సిట్ రిమాండ్‌ను రద్దు చేయాలని గౌతమ్ సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో, ట్రాన్సిట్ రిమాండ్‌ను సైతం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. నవలఖ నిర్బంధం 24 గంటలు దాటి ఉందని, ఇది చట్టప్రకారం ఆమోదయోగ్యం కానందున విడుదల చేస్తున్నట్టు హై కోర్టు పేర్కొంది. కింది కోర్టు జస్టిస్‌లు ఎస్.మురళీధర్, వినోద్‌ఘోయల్ జారీ చేసిన ఉత్తర్వులను కొ ట్టివేసింది. తాము జారీచేసిన ఈ ఉత్తర్వుల ద్వారా దీనికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులు చేస్తు న్న దర్యాప్తునకు ఆటంకం కలగదని స్పష్టం చేసిం ది. అంతకుముందు మహారాష్ట్ర తరఫున వాదిస్తు న్న లాయర్లు గౌతమ్ హౌస్ అరెస్టును మరో రెం డు రోజులు పొడిగించాలని హైకోర్టును కోరగా, సుప్రీం తీర్పును పరిశీలించాలని సూచించారు.