క్రైమ్/లీగల్

డిసెంబర్‌లోగా హైకోర్టు నిర్మాణం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే డిసెంబరులోగా హైకోర్టు భవన నిర్మాణం పూర్తి చేస్తామని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏపీ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలోనే ఏర్పాటు చేయాలంటూ 2015లో ధన్‌గోపాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ కేంద్రం సుప్రీం కోర్టులో స్పెషల్ లీల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాది పాలి నారిమన్ వాదనలు కొనసాగిస్తూ ఏపీలో హైకోర్టు భవనం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుని ఏప్పటిలోగా పూర్తవుతుందని ఏపీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. డిసెంబర్‌లోగా హైకోర్టు నిర్మాణం పూర్తిచేస్తామని నారిమన్ సమాధానం ఇచ్చారు. దీనిపై ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ధర్మాసనం ఆయనను ఆదేశించింది. ఇక ఏపీలో హైకోర్టు నిర్మాణం పూర్తవుతున్నాందున పిటిషన్ విచారణను ఇప్పటితో ముగించవచ్చు కాదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో కేంద్ర తరపున సీనియర్ న్యాయవాది అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్, తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు జోక్యం చేసుకుని హైకోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని గత మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం చెబుతోందని ధర్మాసనానికి వివరించారు. దీనికి నారిమన్ స్పందిస్తూ ఏన్డీయే నుంచి ఏపీ ప్రభుత్వం బయటకు రావడమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ కేంద్రం నుంచి అన్ని విధాలుగా నిధులు ఏపీకి ఇస్తున్నామని, హైకోర్టు నిర్మాణానికి కూడ నిధులు ఇస్తోందని పేర్కొన్నారు. న్యాయవాదులు కేకే వేణుగోపాల్, ముకుల్ రోహత్గి వాదనలు కొనసాగిస్తూ ఏపీలో హైకోర్టు భవన నిర్మాణం జరిగినప్పటికీ వెంటనే వౌలిక సాదుపాయాల కల్పన సాధ్యంకాదని, ఏపీకి వెళ్లేందుకు న్యాయవాదులు కూడ సుముఖత చూపే పరిస్థితి లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనపై పెండింగ్‌లో ఒక పిటిషన్ వుందని కూడ ధర్మాసనానికి వివరించారు. ఈ పిటిషన్ విచారణను కొనసాగిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం డిసెంబరులోగా హైకోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ధర్మాసనానికి వివరించడంతో, ఏపీలో హైకోర్టు భవన నిర్మాణం డిసెంబరులోగా పూర్తి చేస్తామని అఫిడవిట్ రూపంలో రెండు వారాల్లోగా కోర్టుకు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలను వాయిదా వేసింది.