క్రైమ్/లీగల్

ఆర్‌ఎక్స్ -100 సినిమా తరహాలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, అక్టోబర్ 1: రోజురోజుకు సినిమాల ప్రభావంతో యువత పెడదారి పడుతోంది. జగిత్యాలలో ఆర్‌ఎక్స్ 100 సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రభా వంతో పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మాహుతి చేసుకున్నట్టు జగిత్యాల డీఎస్పీ ఎం. వెంకటరమణ వెల్లడించారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ జగిత్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మహేందర్, రవితేజ అనే ఇద్దరు 10వ తరగతి చదువుతున్నారు. అయతే ఇదే పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు అమ్మాయిలతో వీరిద్దరు ప్రేమలో పడ్డారని.. ఈ క్రమంలో అమ్మాయలతో ఫోన్ లో తరచూ చాటింగ్, మాట్లాడుకుంటుండేవారని తెలిపారు. ఇదిలా ఉండగా భవిష్యత్‌లో తమ ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిస్తే ఒప్పుకోరని భావించి వీరిద్దరు ఆత్మాహుతి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి స్థానిక పంప్‌లో పెట్రోల్ కొనుగోలు చేసి మిషన్ కాంపౌండ్ ప్రాంతానికి చేరుకొని సజీవ దహనమయ్యారన్నారు. అప్పటికే వారిద్దరూ మద్యం సేవించి ఉండి ఉంటారని, ఆ మత్తులో వాళ్ల ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుకొని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మాహుతికి పూనుకున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. మంటల్లో కాలుతున్న ఇరువురిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే 80 శాతం శరీరం కలిపోయి మహేందర్ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన రవితేజను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మా ర్గం మధ్యలో మృతి చెందాడని తెలిపారు. రవితేజకు మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఉందని, కొంతమంది మైనర్లు మత్తు పదార్థాలను సేవిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉందన్నారు. 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. వీరి ఇద్దరి ప్రేమ విషయం తెలిసిన వారిని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రానున్నాయని, పూర్తి వివరాలు సమగ్ర విచారణ అనంతరం చెప్తామని అన్నారు. సమావేశంలో పట్టణ సీఐ రత్నాపురం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటరమణ