క్రైమ్/లీగల్

రూ. 30 లక్షల విలువచేసే ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, అక్టోబర్ 1: జిల్లాలోని ఎర్రవారి పాల్యెం మండలం తలకోన అటవీ ప్రాంతంలో ఆ శాఖ అధికారులు నిర్వహించిన కూంబింగ్‌లో రూ.30లక్షల విలువచేసే 12 దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు చామలరేంజ్ ఫారెస్ట్ రేంజర్ రఘునాథ్ వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున అటవీశాఖ అధికారులకు అందిన సమాచారంతో కుప్పగుట్ట వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా 7మంది స్మగ్లర్లను గుర్తించామన్నారు. నెరబైలు గ్రామం, కొత్త తురకపల్లికి చెందిన సయ్యద్ అన్వర్, మహమ్మద్ రఫీలు పట్టుబడగా మరో ఐదు మంది తప్పించుకుని పారిపోయారన్నారు. వీరిలో ఈడిగపల్లికి చెందిన పులిచర్ల శ్రీరాములు, పసుపులేటి వారిపల్లెకి చెందిన రామచంద్రయ్య, సుబ్బయ్య, చింతగుట్టకు చెందిన ప్రకాష్, బ్రహ్మయ్యలు ఉన్నారన్నారు. వీరి కోసం ఎస్టీఎఫ్ దళాలు, అటవీశాఖ సిబ్బంది గాలిస్తున్నాయన్నారు. అరెస్టు చేసిన స్మగ్లర్లను పీలేరు కోర్టుకు హాజరు పరిచామన్నారు. ఈదాడుల్లో ఎఫ్‌ఎస్‌ఓ వేణు, ఎఫ్‌బిఓలు జ్యోతి, వినోద్‌కుమార్, వందన కుమార్ తదితరులు పాల్గొన్నారు.