క్రైమ్/లీగల్

మళ్లీ విచారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: జాతిపిత, మహాత్మాగాంధీ హత్యా ఘటనపై తాజాగా దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ ముంబయికి చెందిన డాక్టర్ పంకజ్ ఫడ్నీస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహాత్మాగాంధీ హత్య వెనక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి తాను సేకరించిన డాక్యుమెంట్లను ఆయన జతపరిచి పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితులపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో డాక్టర్ పంకజ్ ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా తాజా పిటిషన్‌లో రెండు అంశాలను పిటిషన్ ప్రముఖంగా ప్రస్తావించారు. హు కిల్డ్ గాంధీ అనే పుస్తకాన్ని లౌరెన్స్ డీ సాల్వెడర్ రాశారని, ఈ పుస్తకం 1963లో ప్రచురితమైందన్నారు. ఇండియా రిమెంబెర్డ్ అనే పుస్తకాన్ని పామెల్ల వౌంట్‌బాటెన్ రాశారన్నారు. ఈ రెండు పుస్తకాలను చదివితే అధికారంలో ఉన్నత స్థానంలో ఉన్న వారు గాంధీ హత్యకు కుట్ర పన్నినట్లు అనిపిస్తుందన్నారు. మహాత్మాగాంధీ చాతిపై 4 గాయాలున్నాయని, నేషనల్ గాంధీ మ్యూజియం నుంచి ఈ ఫోటోను సేకరించినట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చి 28వ తేదీన తాను గాంధీ హత్యపై పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. ఈ దశలో ఈ దర్యాప్తు చేయడం నిష్ఫలమని సుప్రీంకోర్టు పేర్కొనదన్నారు. అభినవ్ భారత్ చారిటబుల్ ట్రస్టును నిర్వహిస్తున్న పంకజ్ ఫడ్నవీస్ మాట్లాడుతూ తాను సమర్పించిన మెటీరియల్‌ను పరిశీలించాలన్నారు. మహాత్మాగాంధీని నాథూరాంగాడ్సే కాల్చి చంపినట్లు ఆరుగురు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని, తొమ్మిది మంది నిందితులు కుట్రపన్నినట్లు వెల్లడైందని చెప్పారు. 1949 ఫిబ్రవరి 10వ తేదీన విచారణ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసిందని, ఒకరిని నిర్దోషిగా విడుదల చేసిందన్నారు. గాడ్సే, నారాయణ్ ఆప్టేకు మరణ శిక్ష విధించారన్నారు.