క్రైమ్/లీగల్

రెండు నెలల్లో న్యాయాధికారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సవరించిన హైకోర్టు మార్గదర్శక సూత్రాల ప్రకారమే రెండు తెలుగు రాష్ట్రాల్లోని న్యాయాధికారుల ఎంపిక జరిపి, రెండు నెలల లోగా కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సక్రి, జస్టిస్ అశోక్ భూషన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ తీర్పునిచ్చింది. ఈ కేసుపై సుప్రీం కోర్టులో దాదాపు మూడు సంవత్సరాల పాటు విచారణ జరగడం గమనార్హం. కేంద్ర డీఓపీటీ కూడా ఆమోదించిన సవరించిన హైకోర్టు మార్గదర్శక సూత్రాలు చట్టసమ్మతమేనని సుప్రీం కోర్టు తమ తీర్పులో స్పష్టం చేసింది. తమ రాష్ట్రంగా ఎంచుకున్న ఆంధ్రా న్యాయమూర్తులకు సీనియారిటీ ఉన్నప్పటికీ, ఇక్కడ న్యాయమూర్తులుగా నియమించకూడదంటూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం చేసిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వీరికి సీనియారిటీ ఉండటంతో పాటు తెలంగాణను తమ రాష్ట్రంగా ఎంచుకున్నందున ఈ వాదన ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడింది. ఈ వాదన న్యాయ విరుద్ధమని ఇరువురు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. న్యాయాధికారుల ఎంపిక, కేటాయింపు సీనియారిటీ ప్రకారం కాకుండా స్థానికత ఆధారంగా చేయాలంటూ తెలంగాణ న్యాయాధాకారుల సంఘం వేసిని పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సేవా నియమాలు (సర్వీస్ రూల్స్)ను తెలంగాణ రాష్ట్రం స్వీకరించగా, దీనిని హైకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త సేవా నియమాలను (సర్వీస్ రూల్స్)ను ఏర్పాటు చేసుకున్నందున పాత సర్వీస్ రూల్స్‌పై వేసిన పిటిషన్లు అన్నీ చర్చకు మాత్రమే పనికి వస్తాయి తప్ప విచారణకు పనికిరావని ఇరువురు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అందుకే వీటిపై వేసిన పటిషన్లను కొట్టివేస్తున్నట్టు తమ తీర్పులో పేర్కొన్నారు. 2014- 2015లో జరిగిన న్యాయాధికారుల నియామకాలను కొట్టి వేయాలని పిటిషన్లు డిమాండ్ చేయలేదు కాబట్టి వీటి గురించి తాము పట్టించుకోవటం లేదన్నారు. ఉమ్మడి హైకోర్టు తరపున వాదించిన సీనియర్ న్యాయవాది వెంకటరమణి అందజేసిన చార్ట్ ప్రకారం తెలంగాణకు చెందిన న్యాయాధికారులను ఆ రాష్ట్రానికే నియమించినట్లు స్పష్టమవుతోందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తెలంగాణను ఎంచుకుంటూ న్యాయాధికారులు ఇచ్చిన వినతులను అంగీకరించటం జరిగిందన్నారు. హైకోర్టు సవరించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం న్యాయాధికారుల విభజన జరిగితే 20140 సంవత్సరానికి కూడా తమ ప్రాంత న్యాయధికారులెవ్వరు కూడా న్యాయమూర్తిగా పదోన్నతి పొందలేరంటూ తెలంగాణ న్యాయవాదుల తరపు న్యాయవాది చేసిన వాదనతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. హైకోర్టు తయారు చేసిన మార్గదర్శక సూత్రాల్లో తమకు ఎలాంటి తప్పులు కనిపించలేదని వారు స్పష్టం చేశారు. హైకోర్టు మాదర్గదర్శకాలను అకారణంగా పెద్ద ఎత్తున మార్చివేసిందంటూ పటిషనర్ తరపు న్యాయవాది చేసిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తయారు చేసిన మార్గదర్శక సూత్రాల్లో పెద్దగా మార్పులు లేవని, ప్రధానాంశంలో పెద్దగా మార్పు లేదని కోర్టు సూచించింది. మూసాయిదా మార్గదర్శక సూత్రాలు, ఖరారు చేసిన మార్గదర్శక సూత్రాలు దాదాపుగా ఒకటేనని న్యాయమూర్తులు తెలిపారు. న్యాయాధికారుల సీనియారిటీ అత్యంత ముఖ్యమైన అంశం, దీనిని కాదనటం సమంజసం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రాన్ని ఎంచుకున్న వారికి సీనియారిటీ ప్రకారమే ఆ రాష్ట్రంలో నియమించటం జరిగిందని కోర్టు అన్నారు. స్థానికత ఆధారంగా న్యాయ వ్యవస్థలో ఉపాధి కల్పించాలని సూచించే చట్టాలను పిటిషనర్లు చూపించలేకపోయారని కోర్టు తెలిపారు. ఉమ్మడి హైకోర్టు తరపున సీనియర్ న్యాయవాది వెంకటరమణి, ఆంధ్ర న్యాయాధికారుల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు, వై రాజగోపాలరావు వాదిస్తే, తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జయసింగ్, సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్, తెలంగాణా ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఉదయ్‌కుమార్ సాగర్ కోర్టుకు హాజరయ్యారు.