క్రైమ్/లీగల్

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 3: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా నది జలాల పంపకాలపై ఉద్దేశించబడిన జస్టిస్ బ్రీజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ గురువారానికి వాయిదా పడింది. ట్రిబ్యునల్ ముందు హైడ్రాలజీ అంశాలపై ఏపీ తరపు సాక్షిగా ఉన్న హైడ్రాలజీ నిపుణుడు విశే్వశ్వరరావును తెలంగాణ తరపున సీనియన్ న్యాయవాది వైద్యనాథన్ బుదవారం క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఏపీలో గోదావరి నది నుంచి నీటి మళ్లీంపు, నాగార్జునసాగర్ కాల్వల కింద సాగునీటి అవశ్యకత, గోదావరి నుంచి చింతలపూడి, పట్టిసీమ ద్వారా మళ్లిస్తున్న నీటి వివరాలు కొత్త ఆయకట్ట నీటి అవకసరాలు తదిదర అంశాలపై ఏపీ తరపు సాక్షిగా ఉన్న విశే్వశ్వరరావును తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ పలు ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు విశే్వశ్వరరావు సమాధానాలు ఇచ్చారు. బుదవారం కూడ ట్రిబ్యునల్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది.