క్రైమ్/లీగల్

హైకోర్టు ఆదేశాలను సమీక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: కొరిగాన్ బీమా కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురు మానవ హక్కుల సంఘం నేతల్లో ఒకరిని విడుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మహారాష్ట్రప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. మానవ హక్కుల సంఘం నేత గౌతమ్ నవలకను గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని కోర్టు ఆదేశించిన విషయం విదితమే. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను రిజిస్ట్రీలో నమోదు చేశారు. ఈ వివరాలను మహారాష్ట్రప్రభుత్వ న్యాయవాది కాట్నేశ్వర్ వెల్లడించారు. గత సోమవారం హైకోర్టు ఆదేశాల మేరకు గౌతమ్ నవలకను గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. ఐదు వారాల పాటు నవలకతో పాటు మరో నలుగురు మానవ హక్కుల సంఘాల నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి విదితమే. హైకోర్టు సీఆర్‌పీసీని తప్పుగా అర్థం చేసుకుని విడుదల చేసిందని మహారాష్ట్రప్రభుత్వం పిటిషన్‌లో ఆరోపించింది. సుప్రీంకోర్టు నాలుగు వారాల పాటు గృహ నిర్బంధాన్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో గృహ నిర్బంధం నుంచి ఎలా విముక్తి కల్పిస్తారని ప్రభుత్వం పేర్కొంది. రిమాండ్ ఆర్డర్‌ను హైకోర్టు పక్కనపెట్టిందని పిటిషనర్‌లో పేర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా కోర్టు ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు చట్టబద్ధమైన మార్గాన్ని, నిబంధనలను అనుసరించారని పేర్కొన్నారు. ట్రాన్సిట్ రిమాండ్ విషయంలో కూడా పోలీసులు చట్టం మేరకు నడుచుకున్నారన్నారు. ఆగస్టు 28వ తేదీన చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ట్రాన్సిట్ రిమాండ్ ఆదేశాలను పక్కనపెట్టి హైకోర్టు మానవ హక్కుల సంఘం కార్యకర్త గౌతమ్ నవలకను విడుదల చేస్తూ ఆదేశాలను జారీ చేసినవిషయం విదితమే. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్‌లు జారీ చేశారు. రాజ్యాంగ నిబంధనలకు పోలీసులు తిలోదకాలు ఇచ్చారని కోర్టు పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన మహారాష్ట్ర పోలీసులు ఢిల్లీలో మానవ హక్కుల సంఘం నేత గౌతమ్‌నవలకను అరెస్టు చేశారు. ఈ కేసులో వరవరరావు, అరుణ్ ఫెర్రాయిరా, వెర్నన్ గోన్‌స్లేవ్స్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలకను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఆగస్టు 29వ తేదీ నుంచి వీరిని పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు గృహ నిర్బంధంలో ఉంచారు.