క్రైమ్/లీగల్

అనర్హత ఎమ్మెల్యేలపై స్పందన తెలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: లాభాపేక్ష వ్యవహారానికి సంబంధించిన అంశంలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలపై తన స్పందన తెలియచేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను అనర్హతకు గురైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేశారు. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ మృదుల్ విచారించారు. ఈ కేసులో ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన ప్రశాంత్ పటేల్ కూడా తన అభిప్రాయాన్ని తెలియచేయాలని కోర్టు ఆదేవించింది. ప్రశాంత్ పటేల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఆప్ ఎమ్మెల్యే కైలాష్ గెల్హాట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఎన్నికల సంఘం అనర్హట వేటుకు గురైన ఎమ్మెల్యేల వినతిని తిరస్కరించింది. లాభాపేక్ష వ్యవహారంలో ప్రభుత్వ అధికారులను సాక్షులుగా సమన్లు జారీ చేయాలని అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు కోరారు. ఈ వినతిని కేంద్ర ఎన్నికల సంఘం తోసి పుచ్చింది. కాగా ఈ కేసును నవంబర్ 1వ తేదీ నుంచి విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.