క్రైమ్/లీగల్

ఉమ్మడి హైకోర్టుకు వెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్, శాసన సభకు ముందుస్తు ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది. సుప్రీం కోర్టులో దాఖలైన ఈ రెండు రిట్ పిటిషన్‌లను కొట్టివేస్తూ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ధర్మాసనం సూచించింది. తెలంగాణలో అక్టోబర్ 8వ తేదీ సోమవారం నాడు ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్న పరిస్థితుల్లో హైకోర్టు నేడు విచారణ జరపాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ పిటిషనర్ వాదనలలో మెరిట్స్ ఉంటే పరిశీలించి రాష్ట్ర ఎన్నికల సంఘం తుది జాబితా విడుదలపై నిర్ణయించిన ఈ నెల 8 కటాఫ్ తేదీపై తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు స్వేచ్ఛను ఇచ్చింది. తెలంగాణ ఓటర్ల జాబితా అవకతవకలు, ఓటర్ల జాబితా ప్రచురణ తేదీలకు సంబంధించి హైకోర్టులో పలు పిటిషన్లు విచారణలో ఉన్నందునా సుప్రీం కోర్టులో విచారణ అవసరం లేదని ధర్మాసనం పిటిషన్లను తోసిపుచ్చింది. తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు, ముందస్తు ఎన్నికలపై మర్రి శశిధర్‌రెడ్డి, పోతుగంటి శాశంక్ రెడ్డిలు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లను గురువారం జస్టీస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మాను సింఘ్వీ, జంధ్యాల రవిశంకర్‌లు సుదీర్ఘ వాదనలు వినిపించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 18 లక్షల మంది ఉన్నారని వివరాలతో ధర్మాసనం ముందుంచారు. ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల 8 కటాప్ తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. శాసన సభ రద్దు చేసినందున ఈ కటాఫ్ తేదీని కుందించారని వాదనలు వినిపించారు. శాశంక్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు నిరూప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ముందస్తు ఎన్నికలపై ఓటు హక్కు వచ్చి ఈ ఎన్నికల్లో వినియోగించుకునే అవకాశాన్ని సూమారు 20 లక్షలకు పైగా యువకులు కోల్పోతారని ధర్మాసానికి వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అమిత్ శర్మ వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితాకు సంబంధించిన పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనానికి వివరించారు. ఈ పిటిషన్లు దాఖలు చేసిన అంశంపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఈ పిటిషన్లు తోసిపుచ్చిన ధర్మాసనం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్లకు సూచించింది. పిటిషనర్ల వాదనలో మెరిట్ ఉంటే ఓటర్ల తుది జాబితాపై ఎన్నికల సంఘం నిర్ణయించిన కటాఫ్ తేదీపై తుది నిర్ణయం తీసుకునే వెసులుబాటును హైకోర్టు కల్పించింది.