క్రైమ్/లీగల్

అధ్యయన వివరాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో నిల్వజలాలపై అధ్యయనం చేశారా? అని కేంద్ర జల సంఘాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీనిపై అధ్యయనం చేసి ఉంటే శుక్రవారం కోర్టుకు అందజేయాలని, లేని పక్షంలో ఈ అధ్యయనానికి ఎంత సమయం పడుతుందో తెలిపాలని ధర్మాసనం కేంద్ర జల సంఘాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరుపుతున్నారని, ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఒడిషా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ గురువారం జస్టీస్ మదన్. బీ.లోకుర్, జస్టీస్ అబ్ధుల్ జజీర్, జస్టీస్ దీపక్ గుప్తాలతో కూడిన త్రీసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ముందుగా ఒడిషా రాష్ట్ర తరపు న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టు నిర్మాణం మూలంగా తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని మ్యాప్ ద్వారా ధర్మాసనానికి వివరించారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డును అనుసరించి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగడం లేదని, 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామార్థ్యానికి మించి నిర్మాణం జరుగుతోందని వాదించారు. దీనిపై ఏపీ తరపు న్యాయవాది ముంపుప్రాంతాలకు సంబంధించిన ఏ ఆధారాలతో మ్యాప్‌లు తీసుకోచ్చి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే ఈ వివాదంపై అన్ని రాష్ట్రాలు కూర్చుని పరిష్కారం దిశగా అడుగులు వేయాలని గతంలో సూచించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. దీనిపై మూడు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా ఎటువంటి పరిష్కారం దొరకలేదని ఒడిషా న్యాయవాది తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై స్టాప్ వర్క్ ఆర్డర్‌పై కేంద్రం పదేపదే స్టే ఇస్తూ నిర్మాణ పనులను కొనసాగిస్తుందని ఒడిషా తరపు న్యాయవాది పేర్కొన్నారు. తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ వాదనలు కొనసాగిస్తూ ప్రాజెక్టు ఎత్తు 140 అడుగుల మేరకు నిర్మాణం చేస్తున్నారని, 50 లక్షల క్యూసెక్కుల పరిగణలోకి తీసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలవర ప్రాజెక్టు ఎగువన నిల్వజలాలపై అధ్యయనానికి సంబంధించిన వివరాలను కేంద్ర జల సంఘం శుక్రవారం అందించాలని కోరింది.