క్రైమ్/లీగల్

మేము జోక్యం చేసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: మైన్మార్‌కు చెందిన ఏడుగురు రోహింగ్యాలను ఆ దేశానికి అప్పగించే విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏడుగురు రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి వచ్చి స్థిరపడినట్లు రుజవైనందున కోర్టు శిక్ష కూడా విధించిందని, మియాన్మార్ కూడా తమ దేశ పౌరులని గుర్తించిందని సుప్రీంకోర్టు పేర్కొం ది. ఏడుగురు రోహింగ్యాలను మియాన్మార్‌కు అప్పగించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
తమను మైన్మార్‌కు అప్పగించడాన్ని సవాలు చేస్తూ ఏడుగురు రోహింగ్యాల్లో ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము అసోంలోని సిల్చార్ డిటెన్షన్ సెంటర్‌లో శిక్ష అనుభవించామని తెలిపారు. 2012లో ఈ ఏడుగురు రోహింగ్యా ముస్లింలు మియాన్మార్ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వీరు తమ దేశ పౌరులని గుర్తిస్తూ మియాన్మార్ తెలిపిందన్నారు. వీరిని మణిపూర్ చెక్‌పోస్టు వద్ద మియాన్మార్ సరిహద్దు మోరేహ్ వద్ద ఆ దేశాధికారులకు అప్పగిస్తామని కోర్టుకు తెలిపారు. కాగా ఇప్పటికే కోర్టు పరిధిలో రోహింగ్యా ముస్లింలకు సంబంధించి ఒక పిల్ పెండింగ్‌లో ఉంది. దేశంలో 40వేల మంది రోహింగ్యాలు నివసిస్తున్నారని, మియాన్మార్‌లో ఊచకోతల నుంచి తప్పించుకుని భారత్‌లోకి వచ్చారని, వీరిని ఆ దేశానికి అప్పగించాలన్న కేంద్రం యోచనను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌ను గతంలో దాఖలైంది.కాగా గురువారం సుప్రీంకోర్టులో ఏడుగురు రోహింగ్యాల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. వీరి పట్ల సానుభూతిగా వ్యవహరించాలని ఆయన పదేపదే కోరగా, మా బాధ్యతలను గుర్తు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

చిత్రం..మణిపూర్‌లోని సరిహద్దు వద్ద మైన్మార్ ప్రభుత్వానికి అప్పగించేందుకు
ఏడుగురు రోహింగ్యా శరణార్థులను తీసుకొచ్చిన అస్సాం పోలీసు అధికారులు