క్రైమ్/లీగల్

మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై ‘కోడ్’ ఉల్లంఘన కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివనగర్, అక్టోబర్ 4: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వచ్చిన ఫిర్యాదుపై సెక్షన్ 171/ఈ ప్రకారం బుధవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు సదాశివనగర్ ఎస్‌ఐ నరేష్ తెలిపారు. సదాశివనగర్ ఇన్‌చార్జి తహశీల్దార్ రంజిత్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా గురువారం ఇన్‌చార్జి తహశీల్దార్ రంజీత్‌కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ, మండలంలోని మర్కల్ గ్రామంలో గత నెల 26న ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా తాజా మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి పర్యటించారని తెలిపారు. ఆ ప్రచారంలో భాగంగా ఆయన డ్వాక్రా మహిళలతో మాట్లాడుతూ, మహిళా సంఘాలు తనను గెలిపించాలంటూ తీర్మానం చేస్తే 5 లక్షలు ఇస్తానంటూ ప్రలోభ పెట్టారని, ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనంటూ, ప్రతిపక్షాలు ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, దీనిపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించిందని అన్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి నివేదికలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఎన్నికల అధికారులకు నివేదికలు అందినందున పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయునిమిత్తం, ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో తాను సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ. నరేష్ తాజామాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై సెక్షన్ 171/ఈ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్‌ఐ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు.