క్రైమ్/లీగల్

వరకట్న వేధింపుల కేసులో ఎస్‌ఐకి ఏడాది జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలుకూరు: భార్యను వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన ఎస్‌ఐకి ఏడాది జైలుశిక్షతో పాటు ఐదువేల రూపాయల జరిమాన విధిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ప్రియాంక గురువారం తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి చిలుకూరు ఎస్‌ఐ నారాయణరెడ్డి అందించిన వివరాల్లోకెళితే.. మునగాల మండలం బరాఖాత్‌గూడెం గ్రామానికి చెందిన యూసఫ్ జాని 2009లో ప్రొబేషన్ ఎస్‌ఐగా పనిచేస్తున్న సమయంలో చిలుకూరు మండలంలోని జెర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన షేక్ జమాలోద్ద్దీన్ కుమార్తె రహీమాతో మే 5, 2009లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 30 లక్షలు కట్న కానుకలుగా ఇచ్చారు. పెళ్లయన ఏడాది నుంచి ఎస్‌ఐ తన భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. దీంతో 2010లో భార్య రహీమా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కాగా, ఈ కేసును విచారించిన మేజిస్ట్రేట్ నేరం రుజువు కావడంతో ఎస్‌ఐ యూసఫ్ జానీకి ఏడాది జైలు శిక్షతో పాటు ఐదువేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు చెప్పారు. జరిమానా మొత్తం ఐదువేలు చెల్లించకపోతే ఒక నెల సాధారణ జైలు శిక్షను అదనంగా అనుభవించాలని తీర్పునిచ్చారు. కాగా జైలు శిక్షపడిన ఎస్‌ఐ యూసఫ్‌జాని ప్రస్తుతం హైదరాబాద్‌లోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.