క్రైమ్/లీగల్

ఓయూ ఆర్ట్స్‌కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, అక్టోబర్ 4: జూనియర్ పంచాయతీ సెక్రటరీ పరీక్షలను వాయిదా వేయలని కోరుతూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో విద్యార్థి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాలుపడిన సంఘటన ఓయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఓయూ ఆర్ట్స్‌కాలేజీ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థి శరీరంపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నం చేస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థ్ధిని అదుపులోకి తీసుకోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం విద్యార్థి మాట్లాడుతూ అక్టోబర్ 10న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు పరీక్షలు, ఆర్‌ఆర్‌బీ పరీక్షలు ఉండడంతో చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి పరీక్షలను వాయిదా వేయలని డిమాండ్ చేశారు. కాగా విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఓయూలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థ్ధితులు తలెత్తాయి. వెంటనే పోలీసులు భారీగా చేరుకోని పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చారు.