క్రైమ్/లీగల్

ముంబయ నుంచి గంజాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, అక్టోబర్ 4: జిల్లా కేంద్రమైన జగిత్యాల జేఎన్‌టీయూ సమీపంలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నట్లు కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఆకస్మికంగా దాడి చేసి ఒక కిలోన్నర గంజాయిని పట్టుకున్నట్లు సమాచారం. గంజాయి విక్రయిస్తున్న బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న పోలీస్ ఆ బీటెక్ విద్యార్థిని విచారించగా ముంబయి నుంచి గంజాయి విక్రయాల కోసం ఇక్కడి కొందరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది.
ఇదేవిధంగా బీటెక్ విద్యార్థి ఇచ్చిన సమాచారం మేరకు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని గంజాయి విక్రయదారుల పట్టుకునేందుకు యత్నించగా మరి కొందరు గంజాయి విక్రేతలు పరారైనట్లు తెలిసింది. దాదాపు కిలోన్నర గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఒకరిని అదుపులోకి తీసుకొని గంజాయి విక్రయదారులు ఎంత మంది. ఇందులో ఎవరెవరి హస్తం ఉన్నదీ.. గంజాయి విక్రయదారుల్లో మరొకరు పట్టుబడి సమాచారం బయటకు పొక్కితే మిగతా గంజాయి విక్రేతలు పారిపోయే ప్రమాదం ఉందనే అనుమానంతోనే పోలీసులు రహస్యంగా విచారణ ముమ్మరం చేసినట్లు సమాచారం. కాగా జగిత్యాల జేఎన్‌టీయూ కళాశాల సమీపంలో గంజాయి పట్టుబడిన విషయం గోప్యంగా ఉంచి రహస్యంగా విచారణ చేపట్టామని పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తాం తొందరపడొద్దంటూ సమాచారం చెప్పకుండానే పోలీసులు దాటవేత ధోరణి అవలంబించడం గమనార్హం. అయితే ఇటీవలే జిల్లా కేంద్రమైన జగిత్యాలలో 10వ తరగతి చదువుతున్న కూసరి మహేందర్, రవితేజ అనే ఇద్దరు విద్యార్థులు గంజాయి, మద్యం, హుక్కా మత్తుకు బానిసగా మారి ఇదే మత్తులో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి మత్తులోనే ఒంటిపై పెట్రోల్‌పోసుకొని ఆర్‌ఎక్స్ 100సినిమా తరహాలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మాహుతి చేసుకున్న సంఘటన మరిచిపోకముందే మరోసారి జగిత్యాల జేఎన్‌టీయు సమీపంలో గంజాయి విక్రయాలు చేస్తూ దాదాపు కిలోన్నర గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారనే సమాచారం బయటకు పొక్కడంతో గంజాయి అమ్మకాలు ఆగకుండా జగిత్యాల జిల్లాలో గత కొంత కాలంగా గంజాయి అమ్మకాలు ఆగకుండా కొనసాగుతున్నాయి. గంజాయి మత్తులో యువత చిత్తవుతున్నారనే భయం తల్లిదండ్రులను వెంటాడుతుండడం గమనార్హం. అయితే గంజాయి విక్రయాలను అరికట్టి యువత మత్తువీడి సన్మార్గంలో పయనించేందుకు పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. గంజాయి విక్రయిస్తూ జగిత్యాల జేఎన్‌టీయు సమీపంలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి పట్టుబడడం కలకలం రేపుతోంది.
చిత్రం..జగిత్యాల జేఎన్‌టీయు కళాశాల సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా
బీటెక్ తృతీయ సంవత్సరం విద్యార్థిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు