క్రైమ్/లీగల్

పోలీసు అమరవీరులను స్మరించుకునేందుకే వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 5:ప్రజల శ్రేయస్సు, దేశ రక్షణలో భాగంగా ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీలు మాధవరెడ్డి, వెంకటేష్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా సెలవుల నేపథ్యంలో విద్యార్థుల కోసం సెలవులకు ముందుగానే ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించామన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను 8వ తేదీ వరకూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు సందర్శించవచ్చన్నారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించిన ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు, నేరదర్యాప్తు విధానం, తదితర విషయాలను విద్యార్థులు, ప్రజలకు తెలియజేయడానికే ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అలాగ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన ఆయుధాల గురించి వారు విద్యార్థులకు వివరించారు. ప్రాంతీయ ఫోరెన్సిక్ అసిస్టెంట్ డైరెక్టర్ సిబి లోకేష్ మాట్లాడుతూ నేరం జరిగినప్పుడు నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించడం, ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శాస్ర్తియంగా విశే్లషించి నేరం చేసిన వారిని గుర్తించడం ద్వారానే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.
పోలీసులకు నెమలి అప్పగింత
మంత్రాలయం, అక్టోబర్ 5: జాతీయ పక్షి నెమలిని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. శుక్రవారం మంత్రాలయం గ్రామ సమీపంలోని పొలాల్లో గాయపడిన నెమలిని మాజీ సర్పంచ్ భీమయ్య గ్రామస్థులతో కలసి పట్టుకుని ఎస్‌ఐ శ్రీనివాసనాయక్ అప్పగించగా, ఎస్‌ఐ నెమలిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు.