క్రైమ్/లీగల్

ఆన్‌లైన్‌తో మోసపోయిన యువకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, అక్టోబర్ 5 : మండల కేంద్రానికి చెందిన వైకాపా నాయకుడు తిప్పేస్వామి ఆన్‌లైన్‌లో బుక్ చేసిన సెల్ వచ్చిందంటూ డబ్బులు చెల్లించుకుని రాగి అంత్రాలు ఇచ్చి ఉడాయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గతనెల 30న క్వాలిటీ ఇంపాక్స్ వేలూరు నుంచి మీకు శాంసంగ్ మోబైల్ పోస్ట్ఫాసు ద్వారా పంపిస్తున్నామని, రూ. 2,750 మాత్రమే చెల్లించి రూ.10వేల 4జీ సెల్‌ఫొన్, బ్లూటూత్ అందిస్తామని చెప్పారు. ఈనేపథ్యంలో శుక్రవారం కంపెనీ నుంచి చేస్తున్నట్లు ఫోన్ చేసి పోస్ట్ఫాస్‌కు వచ్చి నగదు చెల్లించి సెల్ తీసుకోమని చెప్పారు. దీంతో నగదు చెల్లించి పార్సిల్ తీసుకుని ఇంటికి తీసుకొచ్చి ఓపెన్ చేయడంతో రాగి అంత్రాలు కనిపించాయి. దీంతో ఖంగు తిన్నాడు.

ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి

గుత్తి, అక్టోబర్ 5 : మండల పరిధిలోని బేతాపల్లి గ్రామంలో ట్రాక్టర్ కింద పడి రవి (3) శుక్రవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కాసా శివకుమార్ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండేవాడు. ఇందులో భాగంగానే ఇంటి ముందు ఉన్న ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసి, రివర్స్ చేస్తుండగా వెనక వైపు నుంచి కుమారుడు రవికుమార్ ట్రాక్టర్ కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

రైతు ఆత్మహత్య

వజ్రకరూరు, అక్టోబర్ 5 : మండల పరిధిలోని ధర్మపురి గ్రామానికి చెందిన రైతు కమ్మ బాలాజీ (50) శుక్రవారం తెల్లవారుజామున అప్పులబాధ తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కృష్ణమ్మ తెలిపిన వివరాల మేరకు 8 ఎకరాల పొలంలో పంటలు సాగు చేయడంతోపాటు కుమార్తెల పెళ్లిళ్లకు దాదాపు రూ.8లక్షల వరకు అప్పుడు చేశాడు. ఈనేపథ్యంలో రోజూ అప్పులు ఎలా కట్టాలా అని ఇంట్లో చింతించేవాడు. దీంతో దిక్కుతోచక తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. గమణించిన ఇరుగుపొరుగు వారు ఓ ప్రైవేట్ వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇబ్రహీం తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

కుందుర్పి, అక్టోబర్ 5 : మండల పరిధిలోని బెస్తరపల్లి గ్రామంలో బోయ బొమ్మన్న (30) కుటుంబ కలహాలతో శుక్రవారం వ్యవసాయ తోటలో ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు బొమ్మన్న మానసిక స్థితి సరిగా లేదని, మొదటి భార్య సంవత్సరంలోపే ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. అప్పటి నుండి కుటుంబ సభ్యులతో గొడవలు పడేవాడు. ఈనేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

దొంగనోట్ల చీటింగ్ కేసులో ఐదుగురి అరెస్టు

రాయదుర్గం, అక్టోబర్ 5 : దొంగనోట్లను ఒకటికి మూడు ఇస్తామని చెప్పి అసలైన నగదుతో ఉడాయించేందుకు యత్నించిన ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు నాగేంద్రప్రసాద్ తెలిపారు. ఈమేరకు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన రుద్రప్పను మూడువంతుల నకిలీ నోట్లు ఇస్తామని నమ్మించి రూ.20 లక్షలు తీసుకురావాలని నమ్మబలికారు. ఈమేరకు అందించిన సమాచారంతో నిందితులు కేశవ (కదిరి), చంద్రశేఖర్ (కదిరి), తిప్పేస్వామి (అనంతపురం)తోపాటు పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వన్నూర్‌సాహెబ్, హోంగార్డు రవిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను జూనియర్ సివిల్ మెజిస్ట్రేట్‌లో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు. నిందితుల నుండి రూ.7,200ను స్వాధీనం చేసుకున్నామన్నారు.