క్రైమ్/లీగల్

కరకంబాడి వద్ద ఎర్రస్మగ్లర్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 5: కరకంబాడి సమీపంలో ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న ఎల్‌ఐసీ ట్రైనింగ్ సెంటర్ వెనుక శుక్రవారం ఉదయం టాస్క్ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ విజయనరసింహులు బృందం కూంబింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ స్మగ్లర్‌ను పట్టుకున్నట్లు విజయనరసింహులు తెలిపారు. ఉదయం 6 గంటలకు కొందరు స్మగ్లర్లు అడవిలో సంచరిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ బృందం గుర్తించింది. వెంటనే అక్కడకు చేరుకున్నారు. వీరి రాకను గమనించిన స్మగ్లర్లు అప్రమత్తమై పలాయనం చిత్తగించారు. ఈ క్రమంలో తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకా కోయినూరుకు చెందిన రాజేంద్రన్ అనే స్మగ్లర్‌ను టాస్క్ఫోర్స్ సిబ్బంది వెంటాడి పట్టుకుని విచారిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అడవిలోకి వచ్చామని, ఒక వాహనంలో ఎర్రచందనం దుంగలను లోడ్‌చేసి తిరిగి అడవిలో దూరి వెళుతున్నామని రాజేంద్రన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు తెలిపాడు. సమాచారం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ ఆర్‌ఐ మురళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రతిభచాటిన డీఆర్‌ఓ శ్రీను, ఎఫ్‌ఎస్‌ఓ నాగరాజు, పీసీలు రెడ్డెప్ప, రమాణారెడ్డి, రమణ, శ్రీను, నవీన్, జగదీష్‌రెడ్డిలను ఐజీ డాక్టర్ ఎం.కాంతరావు, ఎస్‌పీ రవిశంకర్‌లు అభినందించారు.