క్రైమ్/లీగల్

ఎర్రచందనం అక్రమరవాణాకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెలంగాణ రాష్ట్రానికి అవగాహన ప్రచార కార్యక్రమాలు
* రంగంలోకి టాస్క్ఫోర్స్
* 80 వేల తమిళ స్మగర్ల గుర్తింపు
* టాస్క్ఫోర్స్ ఏసీఎఫ్‌లు
--------------------------------------------------------------------------
రామాపురం, అక్టోబర్ 5: ఎర్రచందనం అక్రమరవాణాను అడ్డుకట్ట వేసి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు అవగాహన ప్రచార కార్యక్రమాలతో సత్ప్రవర్తన కల్పిస్తున్నమని కడప, తిరుపతి ఏసీఎఫ్‌లు సోమశేఖర్, క్రిష్ణయ్యలు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో టాస్క్‌పోర్స్ సిబ్బందికి అటవీ శాఖ సిబ్బందికి అవగాహన సదస్సులో మాట్లాడారు. స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రానికి చెందిన శ్రీగంధంలో ప్రసిద్ధిగాంచిన వీరప్పన్ సొంత జిల్లా జీవచావరాయినిల్స్ మెయిలిగిరి పచ్చబండకు చెందిన ఒకే తెగకు చెందిన గిరిజనులు వీరప్పన్‌ను ఆదర్శంగా తీసుకొని అతి మారుమూల ప్రాంతాల నుండి ఎర్రచందనం దుంగల కోసం మన ప్రాంతంలో అక్రమరవాణాకు అలవాటు పడ్డారని, అక్కడ సుమారు 80 వేల మంది స్మగ్లర్లుగా తయారై వేరే జీవనాధార పరిస్థితులు లేకపోవడంతో మన రాష్ట్రానికి ఎర్రచందనం నరికివేతకు కూలీలుగా వస్తున్నారని వారందరినీ 2014లో కాంతారావు డీఐజీగా ఎర్రచందనాన్ని కాపాడేందుకు టాస్క్ఫోర్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారన్నారు. పోలీసు శాఖ అటవీ శాఖల నుండి 60 మంది బృందాలుగా ఏర్పడి ఒకరినొకరు సహకారంతో టాస్క్ఫోర్సులో పనిచేస్తున్నారన్నారు. తిరుపతి కేంద్రంగా టాస్క్ఫోర్స్ ఉండటంతో రైల్వేకోడూరులో ఏర్పాటు చేశామని, కడప, మైదుకూరులలో కూడా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. స్మగ్లర్లను అరికట్టడానికి తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడి గిరిజనులకు 5 వేల కోట్లతో అన్ని వౌలిక వసతులు కల్పించారని, దీంతో ఎర్రచందనం రవాణా తగ్గిందన్నారు. ఎర్రచందనం తరలించు వాహనాల యాజమాన్యంపై కేసులు 32బి యాక్టు కింద నమోదు చేసి ఆస్తులు జప్తు చేస్తామన్నారు. నరికేవారు మేస్ర్తి, పైలెట్, వాహనాల నెంబర్ల మార్పిడి ఎగువమతులు చేసేవారు అంతర్జాతీయ స్మగ్లర్లపై ఎప్పటికప్పుడు టాస్క్ఫోర్స్ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో తమ సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యాప్ ద్వారా వాహన నెంబర్లను కూడా ట్రేస్ చేస్తామన్నారు. అలాగే డాగ్‌స్వ్కాడ్ ద్వారా స్మగ్లర్లను పట్టడం, అనుమానితులను ఎప్పటికప్పుడు పట్టుకోవడం వారి కదలికలపై వెంటనే టాస్క్ఫోర్స్‌తో జల్లెడ పడుతున్నామన్నారు. రామాపురం మండలంలోని పాలకొండలు, ఎనుముద్దబావి, సరస్వతిపల్లె, వంగిమళ్ల, గువ్వలచెరువు తాండాలకు 60 మంది సిబ్బందితో టాస్క్ఫోర్స్‌తో కలిసి జల్లెడ పట్టేందుకు వెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ రమణారెడ్డి, బాష, లక్ష్మీపతి, ప్రసాద్, రాయచోటి రేంజర్ మణి, సెక్షన్ ఆఫీసర్ శ్రీరాములు, టాస్క్ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.