క్రైమ్/లీగల్

అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, అక్టోబర్ 5: అగ్నిప్రమాదాలు జరగకుండా ఆసుపత్రులలో సైతం అన్ని రకాల జాగ్రత్త చర్యలూ తీసుకోవాలని పొన్నూరు ఫైర్ అధికారి విహెచ్ సాంబయ్య ఆసుపత్రి నిర్వాహకులు, సిబ్బందికి సూచించారు. పొన్నూరులోని డాక్టర్ రవీంద్ర ఆసుపత్రిలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఫైర్ ఆఫీసర్ ఆసుపత్రిలో మంటలను ఆర్పే పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, నీటి వనరులు కూడా ఉండటం శ్రేయస్కరమన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ సజ్జా రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వరిగడ్డివాములు దగ్ధం
చేబ్రోలు, అక్టోబర్ 5: అనుమానాస్పద స్థితిలో సుమారు 80 వేల రూపాయల విలువ చేసే వరిగడ్డివాములు శుక్రవారం ఉదయం పరశురాముని ప్రీతికి గురయ్యాయి. మండల పరిధిలోని కొత్తరెడ్డిపాలెంకు చెందిన గడియం సిద్ధారెడ్డి అనే రైతుకు చెందిన 5 ఎకరాల వరిగడ్డి వామి, మరో ఎకరం పశువుల చొప్ప తగలబడింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధిత రైతు సిద్ధారెడ్డి ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.