క్రైమ్/లీగల్

గ్యాస్ సిలిండ్ పేలి రెండు పూరిళ్లు దగ్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిల్లకూరు, అక్టోబర్ 5: మండలంలోని ముత్యాలపాడు పంచాయతీ నాంచారమ్మపేటకు చెందిన కలగుంట మణి, వెంకటరమణయ్యకు చెందిన ఇళ్లలో గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. శుక్రవారం ఉదయం వెంకటరమణయ్య ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా హఠాత్తుగా గ్యాస్ రెగ్యులేటర్ నుంచి మంటలు వ్యాపించడంతో రెండు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు సవర్ల బంగారు ఆభరణాలు, వెంకటరమణయ్య కుమార్తె స్కూల్ సర్ట్ఫికెట్లు, ఇతర విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు గూడూరు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారు మూడులక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.