క్రైమ్/లీగల్

పడగవిప్పిన భూ తగాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, అక్టోబర్ 5: గత కొంతకాలంగా నెలకొన్న భూ తగదాలు ఒక్కసారిగా పడగవిప్పడంతో ఒకరిపై ఒకరు కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈసంఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా రక్తపాతమైంది. క్షతగాత్రులు ఆసుపత్రి పాలయ్యారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలావున్నాయి. దేవీపట్నం మండలం ఇందుకురుపేట గ్రామంలోని సాయినగర్ కాలనీకి చెందిన బెల్లంకొండ గంగాధర్, బెల్లంకొండ శేషన్న, బెల్లంకొండ వీరపండులు ముగ్గురూ అన్నదమ్ములు. వీరికి బంధువులైన ఒంగోలు చిన్నవెంకటరావు, ఒంగోలు సూర్యారావు, ఒంగోలు బాబి, ఒంగోలు చిన్నపండు అన్నదమ్ములు. బెల్లంకొండ, ఒంగోలు కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా భూతగదాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. శుక్రవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా బెల్లంకొండ కుటుంబ సభ్యులకు, ఒంగోలు కుటుంబ సభ్యులకు మధ్య భూవివాదం తారాస్థాయికి చేరుకోవడంతో కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనతో ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకునే సమయానికే బెల్లంకొండ కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే బెల్లంకొండ గంగాధర్, శేషన్న, వీరపండులను ప్రైవేటు వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే ఈ దాడుల్లో ఒంగోలు వర్గానికి చెందిన పలువురు కూడా గాయాలపాలయ్యారని, వారు కూడా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.