క్రైమ్/లీగల్

చిన్నారిని చిదిమేసిన పాఠశాల బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, అక్టోబర్ 5: రోజంతా పాఠశాలలో తోటి విద్యార్థులతో సందడిగా ఉన్న బాలుడిని అదే పాఠశాలకు చెందిన బస్సు మృత్యుశకటంలా చిదిమేసింది. స్నేహితులకు బాయ్ చెబుతూ బస్సు దిగిన బాలుఒఒడు వెనుక చక్రాల కిందపడి నిలిగిపోయాడు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకున్న సంఘటన పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ గ్రామానికి చెందిన బీరప్ప కుమారుడు రిషితేజ్(3) సంఘీ వెళ్లే మార్గంలోని సంకీర్త్ గ్రామర్ హైస్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం అదే పాఠశాలకు చెందిన బస్సు (ఏపీ29యు0482)లో ఇంటికి వచ్చాడు. బస్సు దిగి నానమ్మతో కలిసి వెళ్తుండగా పల్లపుగా ఉండడంతో కాలుజారి కిందపడ్డాడు. డ్రైవర్ బస్సును వెనకకు తీస్తూ రిషితేజ్‌పైకి తీసుకెళ్లాడు. బస్సు చక్రాల కిందపడిన బాలుడు తలపగిలి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఆగ్రహించిన గ్రామస్థులు బస్సు అద్దాలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.