క్రైమ్/లీగల్

భవనంపైనుంచి పడి నైజీరియన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, అక్టోబర్ 5: డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను పోలీసులు పట్టుకునేందుకు వెళ్లగా, పోలీసులను చూసి నైజీరియన్ పైపుద్వారా కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తుకిందపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆసీప్‌నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి కథనం ప్రకారం... నైజీరియన్ దేశానికి చెందిన పాట్రిక్ ఓజనా (35)తో పాటు అదే దేశానికి చెందిన మరో ముగ్గురు నైజీరియన్లు మెహిదీపట్నంలోని అయోధ్యనగర్‌లో శ్రీ సాయి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అయితే పక్కా సమాచారం మేరకు పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పాట్రిక్ ఓజనా ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో పాట్రిక్ పోలీసులను చూసి పారిపోయేందుకు మూడంతస్తుల భవనంపై నుంచి పైప్‌ద్వారా క్రిందికి దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన పాట్రిక్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఏసీసీ తెలిపారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్టుచేసి వారివద్ద 12 గ్రాముల డ్రగ్స్‌తో పాటు ఏడు పాస్‌పోర్ట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిపై గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్లులో పలు డ్రగ్స్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు.