క్రైమ్/లీగల్

ప్రకాశంలో లాకప్ డెత్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు: కారు అపహరణ కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా ఉలవపాడులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనపై ఆదివారం స్థానిక డీఎస్పీ ప్రకాశరావు తెలిపిన వివరాల ప్రకారం- నెల్లూరు జిల్లా కావలికి చెందిన సిహెచ్ వెంకటయ్య కారు అద్దెలకు పంపేవాడు. ఈ కారుకు సిహెచ్ సంతోష్ డ్రైవర్‌గా ఉండేవాడు. సెప్టెంబర్ 4న కావలి కారు స్టాండ్‌లో నిలిపి ఉన్న వాహనం వద్దకు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, వెలిపోడు గ్రామానికి చెందిన షేక్ బాబర్ బాషా (28) కారు కొనుక్కునేందుకు సంతోష్ దగ్గరికి వచ్చాడు. ట్రయల్ రన్ కోసం ఇద్దరూ
కారులో బయలుదేరారు. ఉలవపాడులోని గుణ హోటల్ వద్దకు రాగానే బాబర్ బాషా సంతోష్‌కు డబ్బులిచ్చి బిర్యాని తెమ్మని చెప్పి బాబర్ బాషా కారుతో ఉడాయించాడు. సంతోష్ ఫిర్యాదు మేరకు ఉలవపాడు పోలీస్ స్టేషన్‌లో గత నెల 4న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
దర్యాప్తులో భాగంగా ఈ నెల 6న నెల్లూరులో బాబర్ బాషాను ఉలవపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు గురించి విచారించగా గుంటూరులోని చోర్ బజారులో అమ్మినట్లు తెలిపాడు. దీంతో పోలీసు వాహనంలో అక్కడకు బయలుదేరగా ఉలవపాడు సమీపానికి చేరుకోగానే నిందితుడు తనకు కడుపునొప్పి, ఆయాసంగా ఉందని పోలీసులకు చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు రాత్రి 11.15 సమయంలో తీసుకెళ్లారు. అయితే 11.45 గంటలకు బాబర్ బాషా మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. ఇదిలావుండగా స్థానిక ఏరియా వైద్యశాలలోని మృతదేహాన్ని స్థానిక ఆర్డీఓ కెఎస్ రామారావు, చీరాల డిఎస్పీ వి శ్రీనివాసరావు పరిశీలించి బంధువుల సమక్షంలో శవ పంచనామా చేశారు. విచారణాధికారి డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతదేహంపై ఎలాంటి వాతలు లేవని, మార్చురి బాక్స్‌లో శవాన్ని ఉంచడంవల్ల కొంచెం కమిలినట్లు తెలిపారు. ఏరియా వైద్యశాలలో సిబ్బంది కొరత కారణంగా మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలిస్తున్నామని, సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఘటనపై భిన్న వాదనలు
పోలీసుల అదుపులో మృతిచెందిన బాబర్ బాషా లాకప్‌డెత్‌కు గురైనట్లు కందుకూరు, ఉలవపాడులో కలకలం రేగింది. మృతుని శరీరంపై వాతలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని పరిశీలించేందుకు గానీ, మృతుడి తల్లిదండ్రులు, భార్యతో మాట్లాడేందుకు విలేఖర్లకు పోలీసులు అనుమతివ్వలేదు. బాబర్ బాషా మూడు రోజులుగా ఉలవపాడు పోలీస్ స్టేషన్‌లోనే విచారణలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్రం..బాబర్‌బాషా మృతదేహం