క్రైమ్/లీగల్

విద్యార్థినులపై సామూహిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, అక్టోబర్ 7: తమను లైంగికంగా వేధించేందుకు వచ్చిన ఆకతాయిలకు బడితపూజ చేశారన్న ఉక్రోషంతో కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థినులపై సామూహికంగా దాడి చేసిన ఘటన ఆదివారం బీహార్‌లో చోటుచేసుకుంది. ఊరికి దూరంగా సరైన రక్షణ ఏర్పాట్లు లేని ఈ పాఠశాల విద్యార్థినులపై గుంపు దాడికి పాల్పడగా సుమారు 30 మంది విద్యార్థినులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. వీరి పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. పోలీసుల వివరాల మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అనంతరం నాలుగు పోలీసుస్టేషన్లకు చెందిన హౌస్ ఆఫీసర్ల నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి కొంతమంది మహిళలను సైతం అరెస్టు చేశారు. కేసు పూరాల్లోకి వెళితే..పాట్నా నగరంలోని త్రివేణిగంజ్‌కు సమీపంలో గల దపార్కా అనే గ్రామం వద్దవున్న కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో 12నుంచి 16 సంవత్సరాల వయసుగల బాలికలు చదువుకుంటున్నారు. ఈక్రమంలో ఇక్కడికి గత శనివారం కొంతమంది ఆకతాయి బాలురు వచ్చి అల్లరి చేయడంతో విద్యార్థినులు వారి చర్యలను ప్రతిఘటించారు.
లోనికి జొరబడిన కొంతమంది బాలురను పట్టుకుని పాఠశాల ప్రాంగణం నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అయినప్పటికీ వినిపించుకోని బాలురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో తిరిగబడిన బాలికలు తమ ఆత్మరక్షణ కోసం బాలురపై దాడిచేసి కొట్టారు. దీంతో అక్కడినుంచి పరారైన బాలురు రెండు గంటల తర్వాత వారి తల్లిదండ్రులు, బంధువులను వెంటేసుకుని వచ్చి పాఠశాలలోని విద్యార్థినులపై సామూహిక దాడికి పాల్పడ్డారు. సుమారు గంటపాటు పాఠశాలలో వారి దౌర్జన్యం కొనసాగింది. దీంతో పలువురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాల ఆస్తులు సైతం ధ్వంసం అయ్యాయి. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్ మాట్లాడుతూ నితీష్ కుమార్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు.