క్రైమ్/లీగల్

మహిళపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫర్‌నగర్, అక్టోబర్ 7: ఇరవై నాలుగేళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మజఫర్‌నగర్ జిల్లా భూదాన పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకెళితే..శనివారం నాడు బాధిత మహిళ తన గ్రామానికి తిరిగి వెళ్లేందుకు బస్‌కోసం వేచివుండంగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామంటూ మభ్యపెట్టి బైక్‌మీద ఎక్కించుకున్నారు. ఆమెను ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని భూదాన స్టేషన్ హౌస్ అఫీసర్ భగవాన్ తెలిపారు. పరారీలోవున్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. పుగానా అనే గ్రామం నుంచి బాధితురాలు భూదాన పట్టణానికి వచ్చిందని, ఆమెను మభ్యపెట్టి అడవికి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను త్వరలో పట్టుకుంటామని భగవాన్ తెలిపారు.