క్రైమ్/లీగల్

బెల్టు షాపులపై పోలీసుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, అక్టోబర్ 8: ఎన్నికల నేపథ్యంలో సోమవారం సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి, రేగడిమద్దికుంట గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్న షాపులపై పోలీసులు దాడులు నిర్వహించి, పది రూపాయల విలువ గల వివిధ రకాల మద్యం బాటిల్లు స్వాధీనపర్చుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.రాజేష్ తెలిపారు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న లింగమూర్తి, ముత్యం, శివకుమార్‌లపై కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ దాడులు నిర్వహించడం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. మండలంలోని గ్రా మాల్లో ఎవరు బెల్టు షాపులు నిర్వహించవద్దని, బెల్టు షాపుల పేరిట ఎవరైనా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎస్‌ఐలు రాజేష్, దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.