క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర గజదొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) అక్టోబర్ 8: అతడు చిన్నతనం నుంచి చెడు అలవాట్లతో సహవాసం చేశాడు.. దురలవాట్లు, జల్సాలతో జీవితాన్ని అనుభవించవచ్చని భావించి తన జల్సాలు తీర్చుకోవడానికి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇల్లు కనపడితే చాలు అంతా దోచేసి జాగ్రత్తగా సర్దుకుంటాడు. ఈ క్రమంలో పలుమార్లు అరెస్టై జైలు జీవితం కూడా అనుభవించి వచ్చాడు. అప్పటికీ ప్రవర్తనలో మార్పులేకుండా మరలా పాత జీవితానే్న కొనసాగిస్తూ మరోసారి పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కు వెళ్లాడు. సోమవారం గుంటూరు అర్బన్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సీసీయస్ ఇన్‌ఛార్జి డియస్పీ దేవరకొండ శ్రీనివాస్ నిందితుడి వివరాలను మీడియాకు వెల్లడించారు. గోరంట్లగ్రామానికి చెందిన చిల్లర సురేష్ చిన్న తనం నుంచి చెడు అలవాట్లకు బానిసలా మారి, దొంగతనాలు చేసి సులువుగా డబ్బు సంపాదించవచ్చని ఖాళీగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, కృష్ణ, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలో ఇప్పటివరకు ఇతనిపై 60 కేసులు నమోదు అయ్యాయని డియస్పీ తెలిపారు. ఇదే క్రమంలో చేబ్రోలు పరిధిలో వరుసుగా చోరీలు జరుగుతుండటంతో ప్రత్యేక దృష్టి పెట్టిన అర్బన్ సీసీయస్ పోలీసులు వలపన్ని నిందితుడుని బుడంపాడు వద్ద పట్టుకుని అతని వద్ద నుంచి రూ 4 లక్షలు విలువ చేసే 140 గ్రాముల బంగారం, అరకేజి వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సీసీయస్ సిఐ సుబ్రహ్మణ్యం, చేబ్రోలు ఇనిస్పెక్టర్ నరేష్‌కుమార్, ఐటి కోర్ టీం బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.