క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, అక్టోబర్ 8: మండల పరిధిలోని కొమ్మమూరు ఛానల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... చుండూరుకు చెందిన హరి అనే డ్రైవర్‌కు చెందిన ఆటోలో వస్తుండగా మంచాల దాటగానే కొమ్మమూరు ఛానల్ సమీపంలో చేబ్రోలు వైపు నుంచి మంచాల గ్రామానికి వస్తున్న బైకును ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న పాకనాటి గోపి, మణికంఠ, గోడపాటి పాపయ్య అనే ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనలో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొంది. దీంతో ఆటోడ్రైవర్ హరికి కూడా తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో జీజీహెచ్‌కు తరలించారు.