క్రైమ్/లీగల్

రూ 22లక్షల విలువైన టపాసులు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్లపాలెం, అక్టోబర్ 8: అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వచేసిన టపాసుల స్థావరంపై ఎస్‌ఐ హజరత్తయ్య స్పెషల్ బ్రాంచ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం కర్లపాలెంలో అక్రమంగా టపాసుల నిల్వలున్నట్లు జిల్లా అధికారులకు సమాచారం అందటంతో రూరల్ ఎస్పీ అప్పలనాయుడు ఆదేశాలతో ప్రత్యేకశాఖ అధికారులతో కర్లపాలెం పాతపోలీస్ స్టేషన్ బాజారులో అనుమతులు లేకుండ 21,60,862రూపాయల విలువైన మందుగుండు సామగ్రిని గుర్తించి సీజ్‌చేశారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హజరత్తయ్య తెలిపారు. అనుమతులు లేకుండా టపాసులు గోదాములలో నిల్వచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.