క్రైమ్/లీగల్

35 మోటార్‌బైక్‌లు స్వాధీనం..దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిపూడి, అక్టోబర్ 8 : జిల్లాలోని పలు పట్టణాలు, మండలాల్లోనే కాకుండా గుంటూరు, నెల్లూరు జిల్లాలలో మోటార్‌బైక్‌లు దొంగతనాలు చేస్తున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 35 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం మర్రిపూడి పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండెపి మండలం కోయవారిపాలెంకు చెందిన పాలెపోగు సిద్దయ్య (37) అనే వ్యక్తి కొంతకాలంగా వ్యసనాలకు బానినై బయట దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. డమీ తాళాలు ఉపయోగించి అనేక బైక్‌లు దొంగిలించాడని తెలిపారు. ఆదివారం మర్రిపూడి ఎస్‌ఐ శ్రీహరి మోటార్ వాహనాలు తనిఖీ చేస్తూ సిద్ధయ్య బైక్‌ను విచారిస్తున్న సమయంలో తడబడి సరైన సమాధానం చెప్పలేదన్నారు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో 35 బైక్‌లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. చిలంకూరు గ్రామ సమీపంలోని చెరువులో పలు వాహనాలు దాచగా, ఆ వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ 35 వాహనాలు రూ.13 లక్షలకుపైగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. 28 వాహనాలకు సంబంధించిన కేసులు ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదయ్యాయని తెలిపారు. మిగిలిన ఏడు వాహనాలకు సంబంధించి వాహన యజమానుల వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. మండలంలో వంద గేదెలకు పైగా దొంగలు దొంగిలించారని, ఆ వివరాలు పలు పత్రికల్లో వచ్చినట్లు విలేఖరులు డీఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన స్పందిస్తూ ఎస్‌ఐ శ్రీహరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పొదిలి సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ శ్రీహరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.