క్రైమ్/లీగల్

రాఫెల్ డీల్‌పై రేపు సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగిన రాఫెల్ జెట్ ఫైటర్ల డీల్‌పై విచారణ జరపాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై రేపు విచారణ చేపట్టనున్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్ కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టనుంది. ఈలోగా రాఫెల్ డీల్‌పై యూపీఏ, ఎన్‌డీయే ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలన్నీ సీల్డ్ కవర్‌లో అందజేయాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ అంశంపై తాజాగా వినీత్ దండా (లాయర్) పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఎం.ఎల్.శర్మ దాఖలు చేసిన పిటిషన్‌లో 36 రాఫెల్ జెట్ ఫైటర్ల కొనుగోలు
ఒప్పందంలో అవినీతి జరిగినట్లు పేర్కొన్నారు. అలాగే గత మార్చిలో రాఫెల్ కుంభకోణంపై స్వతంత్రంగా విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నాయకుడు తహ్‌సీన్ ఎస్. పూనావాలా పిటిషన్ దాఖలు చేశారు. రాఫెల్ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసే ముందు డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజర్ ఒప్పందం తీసుకోలేదని ఆయన ఆరోపించారు. రాఫెల్ జెట్ ఫైటర్ విమానాల కొనుగోలు కోసం భారత్ 2016 సెప్టెంబర్ 23న ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే దీనికి సంబంధించిన కాంట్రాక్టును దేశంలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాదని అనిల్ అంబానికి చెందిన రిలయెన్స్‌కు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఒప్పందంలో ఎన్డీయే ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు విపక్షాలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.