క్రైమ్/లీగల్

మైనింగ్ కేసు విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ట్రైమాక్స్ సంస్థ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఇసుక తవ్వకాల్లో ఆక్రమాలకు పాల్పడిందంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ నవంబరు మొదటి వారానికి వాయిదా పడింది. ఇసుక తవ్వకాల పేరుతో మోనోజైట్‌ను ట్రైమాక్స్ సంస్థ వెలికితీస్తోందని, దాని లీజును రద్దు చేయాలని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇసుక తవ్వకాల్లో ఏ ఖనిజాలు వెలికితీశారో తెలుసుకోవడానికి రెండు అధ్యయనాలు జరగాల్సి ఉందని, అందుకు మరింత సమయం కావాలని కేంద్ర అణు ఇంధన పరిశోధన సంస్థ తరపు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మైనింగ్ రద్దుకు సంబంధించిన పలు పిటిషన్లు ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఈ పిటిషన్ అక్కడికే బదిలి చేయాలని ట్రైమాక్స్ సంస్థ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషన్ వాదనలు కొనసాగిస్తూ 10వేల టన్నుల మోనోజైట్ ఖనిజాన్ని అక్రమంగా ఆ సంస్థ వెలికి తీసిందని వాదించారు. ఈ మైనింగ్ లీజును రద్దు చేయడంతోపాటు, మైనింగ్ ద్వారా వచ్చిన సొమ్మును ఆ సంస్థ నుంచి వెనక్కి తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు.