క్రైమ్/లీగల్

పిల్లల గొంతు కోసి చంపిన కసాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపాడుబంగ్లా, అక్టోబర్ 8: భార్యపై కోపంతో అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపాడో వ్యక్తి. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా జూపాడుబంగ్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు నగరానికి చెందిన సిందె గనోజీరావుకు ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని మల్వాడా గ్రామానికి చెందిన ఝాన్సీబాయితో 2010లో వివాహమైంది. జూపాడుబంగ్లాలో నివాసం ఉంటున్న వీరికి లిఖిత(7), మధుకిరణ్(4) సంతానం. వివాహేతర సంబంధాలకు అలవాటుపడిన ఝాన్సీబాయి పిల్లలు, భర్తను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పిల్లాడిని కరెంటు వైరుత గొంతుకు బిగించి, కూతురు గొంతును బ్లేడ్‌తో కోసి నీటికుంటలో పడేశాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఉరితాడు తెగిపోవడంతో భయంతో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలియగానే నందికొట్కూరు సీఐ మధుసూదనరెడ్డి, ఎస్‌ఐ అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరుకు తరలించారు.