క్రైమ్/లీగల్

సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాల్సిదేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుపై సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలైంది. సుప్రీం తీర్పు భక్తుల మనోభావాలను, ఆలయ ఆచార వ్యవహారాలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌దారు, జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షుడు శైలజా విజయన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. గత నెల 28న ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పులో వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరినీ శబరిమల ఆలయంలోకి అనుమతించాల్సిందేనని తీర్పిచ్చింది. అప్పటినుంచి దీనిపై కేరళతోపాటు అనేక ప్రాంతాల్లో తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.