క్రైమ్/లీగల్

నకిలీ ఓటర్ల జాబితాపై సుప్రీం తీర్పు రిజర్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికల వేళ నకిలీ ఓటర్ల జాబితా వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, సచిన్‌పైలెట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తిచేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో నకిలీ ఓటర్లను జాబితాల్లో చేర్చారని పిటిషనర్లు వాదించారు. కాగా జస్టిస్ ఏకే సిక్రి, అశోక్‌భూషణ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం హియరింగ్‌కు వచ్చిన ఈ కేసు విచారణను పూర్తి చేసింది. గత ఆగస్టు 23న ఈ పిటిషన్లపై స్పందించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం కోరింది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది.