క్రైమ్/లీగల్

కన్నతండ్రి ఘాతుకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 8: మానవ సంబంధాలు రాను రానూ మృగ్యమవుతున్నాయి. స్వార్థంతో సొంత అవసరాల కోసం కన్నకూతురికే ప్రాణాంతక వ్యాధి సోకిన రక్తాన్ని ఎక్కించాడో కర్కశుడైన తండ్రి. తన అవసరాలకు అల్లుడు డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో పగ పెంచుకుని కన్నకూతురికే ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించి, తన వద్ద మాంత్రిక శక్తులు ఉన్నాయని వాటితో తగ్గిస్తానని చెప్పి అల్లుడి వద్ద రూ. 20 లక్షలు వసూలు చేసిన తండ్రి ఘాతుకం గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. సోమవారం అర్బన్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఈ దారుణం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. లాలాపేటకు చెందిన వ్యక్తి స్థానికంగా చిన్న బడ్డీకోట్టు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి గుంటూరు నగరానికి చెందిన యువతితో 2004లో వివాహం జరిగింది. ఇదే సమయంలో అతని మామ తనకు అతీత శక్తులు ఉన్నాయని, దేవతలు తనతో మాట్లాడతారని నమ్మపలికాడు. ఈ క్రమంలోనే అల్లుడి వద్ద పలుమార్లు డబ్బులు కూడా తీసుకున్నాడు. మామ తీరుతో విసుగు చెందిన అల్లుడు అతనికి దూరంగా ఉంటున్నాడు.
దీంతో మామ ధనదాహం తీర్చుకునేందుకు ఏకంగా తన కూతురికే హెచ్‌ఐవి రక్తం ఎక్కించాడు. క్రమేపీ తన భార్య నీరసం, జ్వరం బారిన పడుతుండటంతో అనుమానించి ఎట్టకేలకు వ్యాధిని నిర్ధారించుకున్న అల్లుడు, తనకు లేకుండా తన భార్యకు ఎలా రోగం వచ్చిందో అర్థంకాక పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. తన భార్యకు బయటి నుంచి హెచ్‌ఐవి రక్తం ఎక్కించిన విషయాన్ని వైద్యుల ద్వారా తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. బంధువుల ద్వారా అసలు ఘాతుకం తెలుసుకున్న అల్లుడు.. మామ వద్దకు వెళ్లి నిలదీశాడు. దీంతో మామ తనకు అతీత శక్తులు ఉన్నాయని, తనకు అడిగినంత డబ్బు ఇస్తే వెంటనే నయం చేస్తానంటూ నమ్మబలికి, నగదు, బంగారం ఇతర వస్తు రూపంలో 20 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడు. మామ వికృత చేష్టలను భరించలేని అల్లుడు జిల్లా అర్బన్ ఎస్‌పి విజయారావుకు జరిగిన విషయాన్ని వివరించి, తన మామపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.