క్రైమ్/లీగల్

భార్య చేతిలో భర్త హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంతాలపల్లి, అక్టోబర్ 8: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పరిధిలోని రేపోని గ్రామంలో అనంతుల అంబరీష (35) భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు గ్రామస్థుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రేపోని గ్రామానికి చెందిన అనంతుల అంబరీష, భార్య అనితలకు ఒక ఆడబిడ్డ జన్మించింది.
అయితే, ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయ. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయంలో భార్య అనిత, కూతురు దివ్యతో కలసి అంబరీష మెడకు తాడు బిగించి ఉరివేసి హత్యచేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ చేరాలు, ఎస్సై నందీప్‌కుమార్‌లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు పేర్కొన్నారు.

చిత్రం.. హత్యకు గురైన అంబరీష