క్రైమ్/లీగల్

మావోయిస్టు కమాండర్ మల్లేష్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, అక్టోబర్ 8: మావోయిస్టు దళానికి చెందిన కీలక నేతను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టుచేశారు. మావోయిస్టు దళం హిడుమ బెటాలియన్ మొదటి ప్లాటూన్‌కు సెక్షన్ కమాండర్‌గా పనిచేస్తున్న పొడియం ముడ అలియాస్ మల్లేష్ (32)ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి అరెస్టుచేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ కాకినాడలోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అరెస్టుచేసిన మావోయిస్టు కమాండర్ ముడ వివరాలను తెలియజేశారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమ జిల్లా పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటులపార గ్రామానికి చెందిన పొడియం ముడ ప్రస్తుతం ఆంధ్ర-్ఛత్తీస్‌ఘడ్ బోర్డర్ పరిధిలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న హిడుమ బెటాలియన్ ఫస్ట్ ప్లాటూన్ సెక్షన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. భద్రాచాలం-చర్ల రోడ్డులోని బొజ్జిగుప్ప టి జంక్షన్ వద్ద ఎటపాక పోలీసులు, సిఆర్‌పిఎఫ్ పోలీసులు ఆదివారం సంయుక్తంగా వాహనాలను తనిఖీచేస్తున్న సమయంలో మల్లేష్ వారికి చిక్కాడని ఎస్పీ తెలిపారు. అతని వద్ద నుండి 20 డిటొనేటర్లు, 20 జిలిటెన్స్ స్టిక్స్‌ను స్వాధీనంచేసుకున్నారు. ఇతను 2005వ సంవత్సరంలో దోర్నపాల్ దళం కమాండర్ దేవ ప్రోద్బలంతో మావోయిస్టు దళంలో చేరి, నాల్గవ ప్లాటూన్ దళం సభ్యుడుగా పదోన్నతి పొంది 2009వ సంవత్సరం వరకు పనిచేశాడు. ఇతని పనితీరును చూసిన దళం నేతలు 3వ కంపెనీ డిప్యూటీ కమాండర్‌గా పదోన్నతి కల్పించారు. ఆ సమయంలో పోలంపల్లి పోలీసులు ముడాను అరెస్టుచేయగా ఆ పోలీస్ స్టేషన్ నుండి ఒక ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధంతోపాటు 100 రౌండ్ల మాగ్జిన్‌ను తీసుకుని పోలీసుల కళ్లుకప్పి పరారయ్యాడు. అనంతరం 2011 నుండి ఇప్పటివరకు పిఎల్‌జిఎ హిడుమ బెటాలియన్ ఫస్ట్ ప్లాటూన్ సెక్షన్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. దళంలో చేరిన నాటి నుండి ఇప్పటివరకు 15 సంఘటనల్లో పాల్గొని 198 మంది సీఆర్‌పీఎఫ్, ఇతర సిబ్బంది మృతిచెందడానికి కారకుడుగా ఉన్నాడు. అంతే కాకుండా 122 ఆయుధాలను ఈ సంఘటనల్లో తీసుకుని పరారయినట్టు ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. మావోయిస్టు పొడియం ముడాను అరెస్టుచేయడం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది సంయుక్తంగా సాధించిన విజయంగా అభివర్ణించారు.
మావోయిస్టులు లొంగిపోతే వారి పునరావాసానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఎస్పీ విశాల్ గున్నీ హామీయిచ్చారు. విలేఖరుల సమావేశంలో ఎటపాక ఒఎస్‌డి కెకెఎన్ అంబురాజన్, చింతూరు డీఎస్పీ ఒ దిలీప్ కిరణ్, సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ కిషన్ సాలం, సీఐ ఆర్ రవికుమార్ పాల్గొన్నారు.