క్రైమ్/లీగల్

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు, అక్టోబర్ 9: మార్టూరు అక్రమ వ్యాపారాలకు అడ్డగా మారింది. మార్టూరులో నిత్యం అక్రమ వేబిల్లుల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయిల ఆదాయం కోల్పోతున్నా విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా నిత్యం కోటా బియ్యం మార్టూరు హద్దులు దాటిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలంలోని కోనంకి గ్రామంలో 210 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం అర్ధరాత్రి ఒక ప్రైవేటు గృహంపై దాడి చేసి పట్టుకున్నారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ భూషణం, ఎస్సై జాని, ప్రసాద్ తెలిపారు.