క్రైమ్/లీగల్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పీఆర్‌ఏఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, అక్టోబర్ 9: కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ అమడగూరు మండలానికి చెందిన పీఆర్‌ఏ ఈ పుల్లయ్య మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రఘురామరాజు తెలిపిన వివరాల మేరకు.. అమడగూరు మండలం వెంకటనారాయణపల్లికి చెందిన సబ్ కాంట్రాక్టర్ లక్ష్మీపతి రూ. 10 లక్షలు సిమెంటు రోడ్డు పనులు చేశారు. ఈ పనులు బిల్లులు మంజూరు కోసం రూ. 30 వేలు కాంట్రాక్టర్‌తో ఏఈ బిల్లులు మంజూరు కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలివిడత సబ్ కాంట్రాక్టర్ నుండి రూ. 10 వేలు లంచం తీసుకున్నారు. మిగిలిన డబ్బును ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేయగా సబ్ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పథకం ప్రకారం మిగిలిన రూ. 20 వేలు మంగళవారం ఓడీచెరువులో ఏఈ తన ఇంట్లో కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని నేరుగా డబ్బుతోపాటు ఏఈ పట్టుబడ్డారు. దొరికిన డబ్బుతోపాటు ఏఈని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు.