క్రైమ్/లీగల్

ఎరువుల, పురుగుమందుల దుకాణాలపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 9: ఎరువుల అక్రమ నిల్వలు, కాలంచెల్లిన పురుగుమందుల విక్రయాలు, నకిలీ బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు విడివిడిగా మెరుపుదాడులు నిర్వహించారు. మంగళవారం గుంటూరు పట్నంబజారు, గోరంట్ల, మండల కేంద్రమైన ఈపూరులో దాడులు కొనసాగాయి. ఈపూరులో విఘ్నరాజ ఫర్టిలైజర్స్, లక్ష్మీ వెంకట శ్రీనివాస ఫర్టిలైజర్స్ కంపెనీలపై విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో నిల్వ సామర్ధ్యం, అనుమతి లేని చోట 3,800 ఎరువుల బస్తాలు నిల్వ చేయడాన్ని గుర్తించి వాటిని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 28 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే పట్నంబజారులోని ఐదు పురుగుమందుల షాపుల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు జరిపారు. కాలంచెల్లిన పురుగుమందులను విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. కాగా గుంటూరు రూరల్ గోరంట్లలో సుమారు 20 లక్షల రూపాయల విలువైన నకిలీ బయో ఉత్పత్తులను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. గోరంట్లలోని సుదర్శన్ ఆగ్రో కెమికల్స్, హిందుస్థాన్ ఆగ్రో కెమికల్స్ సంస్థలకు చెందిన గోదాములపై వ్యవసాయశాఖ జెడి విజయభారతి నేతృత్వంలో వ్యవసాయశాఖ అధికారులు దాడులు చేశారు. సుమారు 4 టన్నుల బయో ఉత్పత్తులను, వందలాది లేబుల్స్ లేని డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో శ్యాంపిల్స్ తీసి ల్యాబ్స్‌కు పంపిస్తున్నామని, నివేదిక అందిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని జెడి విజయభారతి తెలిపారు. ఈ దాడుల్లో పెస్టిసైడ్స్ ఎఒ ప్రసన్న, ఫర్టిలైజర్స్ ఎఒ యలమందారెడ్డి, పెదనందిపాడు, పెదకాకాని ఎఒలు ప్రసన్నకుమార్, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

చోరీసొత్తు స్వాధీనం
యడ్లపాడు, అక్టోబర్ 9: యడ్లపాడులో రెండు రోజుల క్రితం చోరీకి గురైన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లను యడ్లపాడు ఎస్‌ఐ కోటేశ్వరరావు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బండారు నవీన్, ముద్దన నాగేశ్వరరావులను అరెస్ట్ చేశారు. చోరీసొత్తును కొద్ది గంటల్లో రికవరీ చేయడం ఈ ప్రాంతంలో ఇదే ప్రథమం. ఎస్‌ఐ కోటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నేరాలను చిలకలూరిపేట సర్కిల్ పరిధిలో అదుపు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని చిలకలూరిపేట సిఐ శోభన్‌బాబు తెలిపారు.