క్రైమ్/లీగల్

ఆలయాల్లో చోరీ నిందితుడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, అక్టోబర్ 9: వనపర్తి ఆలయాలతో పాటు వైన్స్‌లో చోరీ చెసిన నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో సాజరు పరిచినట్లు వనపర్తి డిఎస్పీ సృజన తెలిపారు. మంగళవారం వనపర్తి సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంగళవారం సాయంత్రం వనపర్తిలోని భగీరథ విగ్రాహం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న శేఖ్ చాంద్‌పాష అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడని డిఎస్పీ తెలిపారు. చిట్యాల దారిలోగల చింతల హనుమాన్ ఆలయంలో హుండీని పగుల గొడ్డి డబ్బులు తీసుకెళ్లినట్లు, పాన్‌గల్ రోడ్డులోని చౌడేశ్వరి ఆయలంలో హుండీని పగుల గొట్టేందుకు ప్రయత్నించినట్లు, అలాగే పట్టణంలోని మిత్ర వైన్స్‌లో 20 వేల రూపాయలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని ఆమె తెలిపారు. అతని నుండి 23,500 రూపాయలు రికవరీ చేసినట్లు, అతన్ని కోర్టులో హాజరు పరుచనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సిఐ సూర్య నాయక్, ఎస్సై వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వీపనగండ్ల, అక్టోబర్ 9: మండల పరిదిలోని గోవర్దనగిరి గ్రామ సమీపంలో వనపర్తికి చెందిన లక్ష్మినారాయణ(32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై ఎమ్‌డి జబ్బార్ మంగళవారం తెలిపారు. కొడుకు పుట్టాడని చూడటానికి తన అత్తగారి గ్రామమైన పెద్దదగడకు వెళ్తుండగా గోవర్దనగిరి గ్రామ సమీపంలో బైక్‌పై నుండి కింద పడి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం వనపర్తి నుండి బయలు దేరాడని రాత్రి వరకు పెద్దదగడకు చేరేకోకపోవడంతో మృతుడి భార్య పార్వతమ్మ తమ కుటుంబ సభ్యులందరిని వాకబు చేయగా సమాచారం లేకపోయిందని మంగళవారం ఉదయం వరి పొలంలో మృతి చెందిన వ్యక్తి మోటరు సైకిల్ పడి ఉండటాన్ని గమనించిన పొలం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడని తెలిపాడు. మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెపాడు. మృతునికి భార్య, కూతురు, కమారుడు ఉన్నట్లు తెలిపాడు.
60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
* ఎస్పీ అదేశాలతో మిల్లు తనిఖీ * ఎస్సై నర్సింహులు
కల్వకుర్తి, అక్టోబర్ 9: కల్వకుర్తి పట్టణ సమీపంలో గల సాయిబాలాజీ రైస్ మిల్లులో 60 క్వింటాళ్ళ పీడి ఎస్ బియ్యం సీజ్ చేయడం జరిగిందని కల్వకుర్తి ఎస్సై నర్సింహులు తెలిపారు. జిల్లా ఎస్పీ సాయి శేఖర్ అదేశాల మేరకు సాయిబాలాజీ రైస్ మిల్లులో తనిఖీ చేయగా దాదాపు 120 బ్యాగులలో రేషన్ బియ్యం ఉండటంతో స్థానిక ఆర్ ఐ శశిధర్ పంచనామాతో పీడి ఎస్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగిందని ఎస్సై పేర్కొన్నారు. అక్రమంగా పిడి ఎస్ రైస్‌ను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై అన్నారు.
కల్వకుర్తి పట్టణంలో విచ్చలవిడిగా వ్యాపారం కొనసాగుతున్న కల్వకుర్తి పట్టణంలో గల అక్రమ పిడీ ఎస్ రవాణపై ఎలాంటి తనిఖీ ఉండవు. ఇలాంటి సంఘటనలతో మంగళవారం జిల్లా ఎస్పీ అదేశాలతో తనిఖీలు నిర్వహించడంతో 60 క్వీంటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేశారు. ఇప్పటికైన స్థానిక అధికారులు దాడులు నిర్వహించి పేదోడి బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని పట్టణ, మండల ప్రజలు కోరుతున్నారు.