క్రైమ్/లీగల్

మూడేళ్ల చిన్నారి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక(విశాఖ), అక్టోబర్ 9: మూడేళ్ల చిన్నారిని హతమార్చిన సంఘటన విశాఖపట్నం జిల్లా తీవ్ర విషాదం నింపింది. విశాఖపట్నం జిల్లా, గాజువాక మండలం, దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన మంగళవారం వెలుగు చూచింది. అదృశ్యం అయిన మూడేళ్ల చిన్నారి హత్య గురైందని తెలుసుకున్న పారిశ్రామిక ప్రాంతం కన్నీటి పర్యాంతం అయింది. దీనికి సంబంధించి దువ్వాడ పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి. తెనాలి ప్రాంతానికి చెందిన ఆర్.కృష్ణ ఆరేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన మీనాక్షి వివాహాం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల అలేఖ్య అనే చిన్నారి ఉంది. కృష్ణ, మీనాక్షిలు రైళ్లల్లో సమోసా, వాటర్ బాటిళ్లు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తూ దువ్వాడ సెక్టార్-1 దుర్గానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలో ఏడాదున్నర క్రితం దుర్గ అనే మహిళలను కృష్ణ రెండవ వివాహం చేసుకున్నారు. దుర్గకు నాలుగు నెలలు చిన్నారి ఉంది. అయితే కృష్ణ తొలి భార్య మీనాక్షి, రెండవ భార్య దుర్గలకు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఇదిలావుండగా మీనాక్షి కుమార్తె అలేఖ్య సోమవారం సాయింత్రం అదృశ్యం కావడం, మంగళవారం ఉధయం దుర్గ బంధువులు ఇంటికి సమీపంలో గల ముళ్ల పొదల్లో హత్య గురైన విగత జీవిగా పడి ఉండాన్ని తల్లిదండ్రులు గమనించి దువ్వాడ పోలీసులకు సమాచారం అందించారు. అలేఖ్య ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా భావించి విచారణ చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనం కలిగించింది. మూడేళ్ల చిన్నారి పొట్టన పెట్టుకున్న వ్యక్తులు కోసం పోలీసులు అనే్వషణ చేస్తూ కృష్ణ, రెండవ భార్య దుర్గ, దుర్గ అక్క, బావలైన దేవి, రాజులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని గాజువాక ఎసిపి రంగరాజు, ఇన్‌స్పెక్టర్లు రామారావు, కిశోర్‌కుమార్, లక్ష్మిలు సందర్శించారు. డాగ్‌స్క్వేడ్, క్లూస్ టీం ఆదారాలను సేకరించారు.