క్రైమ్/లీగల్

బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: బ్యాంక్ వినియోగ దారులు ఇచ్చే చెక్‌లను అక్రమంగా ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ సౌకర్యంతో సొంత ఖాతాల్లోకి బదిలీ చేసుకున్న బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఘరానా మోసం బయటపడింది. సంబంధిత బ్యాంక్ సీనియర్ మేనేజర్ సూర్యనారాయణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో మోసం వెలుగులోకి వచ్చింది. మంగళవారం నార్త్‌జోన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ విషయాన్ని సిటీ కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు వివరించారు. సికింద్రాబాద్ ఘోష్‌మండీలో ఉన్న ఏపీ మహాజన్స్ కో- ఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లో సీనియర్ మేనేజర్‌గా పరోల్ సుబ్రమణ్యం మురళి 2014 నుంచి పని చేస్తున్నారు. 2016 నుంచి 2018 వరకు వివిధ మార్గాలతో బ్యాంక్ ఖాతాల నుంచి కుటుంబ సభ్యుల ఖాతాలతో పాటు సొంత ఖాతాల్లోకి రూ. 58 లక్షల రూపాయలు బదిలీ చేశారు. గతంలో ఈయన మహేష్ బ్యాంక్, వర్ధమాన మహిళా బ్యాంక్, ఈనాడు కో ఆపరేటీవ్ బ్యాంకుల్లో మేనేజర్‌గా పని చేశారు.

చిత్రం..బ్యాంకు మేనేజర్ నుంచి స్వాధీనం చేసుకున్న నగదును ప్రదర్శిస్తున్న సిటీ కమిషనర్ అంజనీకుమార్