క్రైమ్/లీగల్

ఆత్మకూరులో వైకాపా నేత దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 10: ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన వైసీపీ నేత గూలి కేశవరెడ్డి (70) బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. కొనప్రాణంతో ఉన్న కేశవరెడ్డిని హుటాహుటిన అనంతపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స చేస్తుండగా మృతి చెందాడు. బుధవారం ఉదయం స్కూటీపై తోట వద్దకు వెళుతున్న సమయంలో దారి మధ్యలో కాపుకాచి దుండగులు దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఒక ప్రైవేటు వాహనంలో తీసుకువచ్చి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేసినా పలితం లేకపోయింది. ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి, పలువురు అనంతపురం సవేరా ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆత్మకూరు సింగిల్‌విండో అధ్యక్షులుగా, ఆయన భార్య రాజేశ్వరమ్మ సర్పంచ్‌గా పనిచేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయారు. కొంతకాలం కిందట వైఎస్‌ఆర్ పార్టీలో చేరి చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటు వస్తున్నాడు. మృతుడికి తన అన్న కుమారుడితో కుటుంబపరంగా మనస్పర్ధలు ఉన్నాయని, గతంలో అన్న కుమారుడు కేశవరెడ్డి తోటలో చీనీ చెట్లు నరికి వేయించాడని అంతకు మించి ఎవరితోను అతనికి తగాదాలు లేవని చర్చించుకోవడం కనిపించింది.
డీఎస్పీ వెంకటరావు సవేరా ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నిందితుడి ఆచూకీకి జాగిలంతో పరిశీలన
ఆత్మకూరు సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు గూలి కేశవరెడ్డి బుధవారం హత్యకు గురయ్యాడు. నిందితుని ఆచూకీ తెలుసుకోవడానికి క్లూస్‌టీం రంగంలోకి దిగి జాగిలంతో పరిశీలన చేయించారు. కేశవరెడ్డిని తన అన్న కుమారుడైన నరసింహారెడ్డే హత్య చేయించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.